Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్‌ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతాల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల దారులు వేరయినప్పటికీ.. కేంద్రాన్ని విమర్శించే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో అతి జుగుప్సాకరమైన భాష ఉపయోగించే కుసంస్కృతి మాత్రం తమకు లేదని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. దేశ ప్రధానిని, దేశ ఆర్థిక శాఖ మంత్రిని అతి జుగుప్సాకరమైన భాషతో దూషించడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Revanth Reddy to BJP - కేసీఆర్ భాషపై బీజేపి ఎందుకు స్పందించడంలేదు..
టీఆర్ఎస్ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భాషపై విరుచుకుపడటంతో ఊరుకోని రేవంత్ రెడ్డి.. ఓవైపు సీఎం కేసీఆర్ అతి జుగుప్సాకరమైన భాష ఉపయోగించి దేశ ప్రధానిని, ఆర్థిక శాఖ మంత్రిని దూషిస్తుంటే, అదే పార్టీకి చెందిన తెలంగాణ బీజేపి నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలుగింటి ఆడపడుచు అయిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ని సీఎం కేసీఆర్ అంతలేసి మాటలంటుంటే.. తెలంగాణ బీజేపి నేతలు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం  దేశ ప్రధాని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిపై నోరుపారేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తంచేయాల్సిందిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్ధాంతాల పరంగా బీజేపి, కాంగ్రెస్ పార్టీలు వేరు కావొచ్చు కానీ దేశ 


Revanth says KCR supporting BJP - కేసీఆర్ బీజేపికి మద్దతుదారు అంటున్న రేవంత్..  
అలాగే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపి గెలుస్తుండొచ్చునేమో కానీ సీట్లు మాత్రం తగ్గుతాయని కేసీఆర్ చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి గెలుస్తుందని సీఎం కేసీఆర్ చిలక జోస్యం చెబుతున్నారా ? లేక ఏమైనా సర్వేలు చేయించి చెబుతున్నారా ? అదీ లేదంటే బీజేపికి మద్దతుదారుడిగా చెబుతున్నారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపి గెలుపు కోసం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసి సుపారి తీసుకుని మరీ పనిచేస్తున్నారని.. వీళ్లవి సుపారి బ్యాచులు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 



Asaduddin Owaisi is KCR's sharp shooter- అసదుద్దీన్ ఒవైసి కేసీఆర్ నియమించిన షార్ప్ షూటర్..
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP assembly elections Surveys) బీజేపిని గెలిపించడం కోసం సీఎం కేసీఆర్ బీజేపి వద్ద సుపారీ తీసుకుని మరీ అసదుద్దీన్ ఒవైసిని షార్ప్ షూటర్‌గా రంగంలోకి దించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడైతే బీజేపిని గట్టిగా విమర్శించే వాళ్లు ఉంటారో అక్కడ అసదుద్దీన్ ఒవైసి తమ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపి బీజేపి వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా పరోక్షంగా బీజేపికి మేలుచేసే పనిలో పడ్డారని.. అందుకే కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసిలవి సుపారీ బ్యాచులుగా అంటున్నానని రేవంత్ రెడ్డి (Revanth Reddy press meet) ఎద్దేవా చేశారు.


Also read : CM KCR slams BJP: రామానుజా చార్య విగ్రహంతో బీజేపి రాజకీయం.. అసదుద్దీన్ ఒవైసి అక్కడ పార్టనర్.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు


Also read : Budget 2022 Political Reaction : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. శ్లోకాలు చెప్పి మరీ మోసం


Also read : TSRTC Busses to Muchintal statue: ముచ్చింతల్‌లో Statue of Equality విగ్రహావిష్కరణ.. హైదరాబాద్ నుంచి ముచ్చింతల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook