TSRTC: ముచ్చింతల్‌లో Statue of Equality విగ్రహావిష్కరణ.. హైదరాబాద్ నుంచి ముచ్చింతల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Statue of Equality: ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో Statue of Equality పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించనున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 07:50 PM IST
  • ముచ్చింతల్‌ వేడుకకు సర్వం సిద్ధం
  • హైదరాబాద్ నలుమూలల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు
  • ఫిబ్రవరి 5న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ
TSRTC: ముచ్చింతల్‌లో Statue of Equality విగ్రహావిష్కరణ.. హైదరాబాద్ నుంచి ముచ్చింతల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Statue of Equality: సమానత్వ విగ్రహాన్ని దర్శించుకునే ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ముచ్చింతల్‌లోని (Muchintal) త్రిదండి చిన జీయర్ స్వామి ఆశ్రమానికి ((Chinna Jeeyar Swamy Ashram) ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 3 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించునున్నారు.  త్రిదండి చిన జీయర్ స్వామి వారి 40 ఎకరాల సువిశాల ఆశ్రమంలో 11వ శతాబ్దపు సంస్కర్త , వైష్ణవ సన్యాసి రామానుజాచార్యులు ( Ramanujacharya Statue) 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 5) ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR).. శ్రీ చిన జీయర్ స్వామితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

ప్రధాని మోదీ (PM Modi) పర్యటన దాదాపు 4 నుంచి 5 గంటలపాటు కొనసాగనుంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారని సమాచారం. మోదీ భద్రత కోసం సుమారు 7వేల మంది పోలీసులు రక్షణ కల్పించనున్నారు.

Also Read: Budget 2022: 'కేంద్రం బడ్జెట్... దశ దిశా లేని గోల్ మాల్ బడ్జెట్'..: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News