CM KCR about Budget 2022: హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ 2022 పై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాదిన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు గురించి ప్రస్తావిస్తూ.. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం హైదరాబాద్‌లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేస్తోన్న రామానుజా చార్య విగ్రహాన్ని సైతం బీజేపి ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల పేరు ఎత్తుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి కూడా వేరే రాష్ట్రాల్లో అక్కడక్కడా పోటీ చేస్తున్నారని అన్నారు. అదే క్రమంలో అసదుద్దీన్ ఒవైసి పేరెత్తుతూ ఈమధ్య ఒవైసి అక్కడ పార్టనర్ అయ్యారని ఎద్దేవా చేశారు.
Asaduddin owaisi house- అసదుద్దీన్ ఒవైసి ఇంటి వెనకాలే..
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసి ఇంటి వెనకాలే ప్రధాని మోదీ రామానుజా చార్య వారి అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా హిందీలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ బీజేపిపై మండిపడ్డారు. రామానుజా చార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తోంది చినజీయర్ స్వామి అయితే ఆ క్రెడిట్‌ని బీజేపి కొట్టేస్తోందని ఆరోపించారు.
Chinna jeeyar swamy - చినజీయర్ స్వామి సొంత కృషి..
చినజీయర్ స్వామి తను సొంతంగా రామానుజు చార్య వారి విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారు. వాస్తవానికి అది తమిళనాడులో ఏర్పాటు చేయాలని చినజీయర్ స్వామి భావించినప్పటికీ అక్కడ వారికి తగిన స్థలం లభించలేదు. అదే క్రమంలో మై హోమ్ హబ్ అధినేత రామేశ్వర రావు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో తన సొంత భూమిలోంచి 100 ఎకరాలు ఉచితంగా కేటాయించారు. ఈ మఠం వేదికగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. అది హిందూధర్మంలోని వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా ఉండే అంశానికి సంబంధించిన విషయం.
Ramanuja Charya's Samatha Murthy statue- రామానుజా చార్య సమతా మూర్తి విగ్రహంతో రాజకీయమా..
రామానుజా చార్య వారు కులాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు. అందుకే ఆయనకు సమతా మూర్తి అనే పేరు పెట్టారు. రామానుజ విగ్రహం ఏర్పాటు కోసం చినజీయర్ స్వామి ఎంతో శ్రమించారు. పైసాపైసా కూడబెట్టి ఈ క్షేత్రం స్థాపిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు ఎవ్వరూ ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. కానీ రామానుజా చార్యుల వారి విగ్రహం ఏర్పాటు అంశాన్ని కూడా బీజేపి తమ సొంత రాజకీయాలకు ఉపయోగించుకుంటోంది అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 108 పుణ్యక్షేత్రాలకు వెళ్తే లభించే దర్శనభాగ్యం ఇక్కడ ఒక్క చోటే లభించే విధంగా చినజీయర్ స్వామి రామానుజ చార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఏర్పాటు వెనుక ఉన్న క్రెడిట్‌ను బీజేపి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
Also read : APSRTC Employees Strike: సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు.. ఏపీలో ఆ రోజు నుంచి బస్సులు బంద్?
Also read : CM KCR slams Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 పై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook