Revanth Reddy Protests Against Centre: రాహుల్ గాంధి ఎంపీ పదవి రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం గాంధీ భవన్ వద్ద గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టనున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు తప్పకుండా పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది అత్యంత కీలకమైన సమయం.. ఇలాంటి సమయంలో మనం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ పైన నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో ప్రవర్తిస్తోంది. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అవడం.. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ గౌతం అదాని అంశాలను గట్టిగా నిలదీయడంతో మోదీ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిండెన్‌బర్గ్ షేర్ల కుంభకోణాన్ని రాహుల్ గాంధీ బయటకు తీయడంతో పాటు ఆ విషయంపై గట్టిగా పోరాటం చేస్తుండడంతో అది తట్టుకోలేకే నరేంద్ర మోదీ సర్కారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ మాట్లాడిన రాజకీయ ప్రసంగాన్ని ఆసరా చేసుకొని కేసు నమోదు చేశారు. దొంగల పేర్ల వెనుక మోదీ ఉండుంటారనే అనుమానాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ఆ కేసులో కేసు వేసిన వ్యక్తి కూడా తర్వాత పెండింగ్‌లో పెట్టమని పిటిషన్ దాఖలు చేశారు. 


అంతేకాకుండా రాహుల్ గాంధీ పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు కోర్టు సైతం 2 నెలల సమయం ఇచ్చింది. అయినప్పటికీ నరేంద్ర మోదీ సర్కారు కుట్రపూరితంగా రాహుల్ గాంధీని ఇలా పార్లమెంట్ నుంచి డిస్‌క్వాలిఫై చేసి కేరళలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ లోక్ సభ స్థానాన్ని ఖాళీగా ఉంచారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 


రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్రతో ప్రజల్లో పలుకుబడి పెరగడం... మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఇలాంటి అంశాలను వాడుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు ఆయన ఎంపీ పదవి రద్దు చేశారు అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్షలో పాల్గొని రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : Telangana Rains Alert: మళ్లీ వడగండ్ల వానలు కురిసే అవకాశం


ఇది కూడా చదవండి : LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్


ఇది కూడా చదవండి : Revanth Reddy Slams PM Modi: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అసలు కారణం అదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK