తెలంగాణలో ( Telangana )  కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శనివారం ఒక్కరోజే 1850కు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల ( Corona cases )  సంఖ్య 22 వేలు దాటేసింది. రాజధాని హైదరాబాద్ లో పరిస్థితీ మరీ ఘోరంగా మాారుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం కేసులు ఒక్క హైదరాబాద్ (Hyderabad) నుంచే వస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 22 వేల 312కు చేరుకుంది. ఒక్క శనివారం రోజే తెలంగాణలో 1850కు పైగా కేసులు నమోదు కాగా...ఇందులో జీహెచ్ ఎంసీ పరిధిలో 1572  కేసులున్నాయి. అటు ఇదే రోజు మృతుల సంఖ్య 5కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 288 మంది మృతి చెందారు. ఇటు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉండటంతో అధికార యంత్రాంగం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 487 యాక్టివ్ కేసులున్నాయి. ఇక డిశ్చార్డ్ అయిన మొత్తం కేసులు 11 వేల 537కు చేరుకున్నాయి. జీహెచ్ ఎంసీ ( GHMC) పరిధిలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో హైదారాబాద్ నగర పరిధిలో లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. లాక్ డౌన్ విధించాలా లేదా...కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్యను పెంచి ఆంక్షల్ని కఠినతరం చేయడమా అనే అంశాలపై ప్రభుత్వ యంత్రాగం కసరత్తు చేస్తోంది. Also read: Telangana: జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం


శనివారం ఒక్కరోజులో 6 వేల 427 శాంపిల్స్  పరీక్షించగా..అందులో 4 వేల 577 నెగెటివ్ గానూ, 1850 పాజిటివ్ గానూ తేలాయి. ఈ నేపధ్యంలో తెలంగాణల్లో పరీక్షల సామర్ధ్యం పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..