Telangana: జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ 19 ను అరికట్టేందుకు వ్యాక్సిన్ పై పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలవి. ఇవి విజయవంతమైతేనే వ్యాక్సిన్ మార్కెట్ లో అందుబాటులో వస్తుంది. ఇటీవల  ఓ భారతదేశ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ సైతం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన నిమ్స్ లో జూలై 7 నుంచి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నారు. 

Last Updated : Jul 4, 2020, 06:31 PM IST
Telangana: జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

దేశంలో కరోనా వైరస్ (corona virus ) బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ 19 ను ( Covid19 vaccine)  అరికట్టేందుకు వ్యాక్సిన్ పై పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలవి. ఇవి విజయవంతమైతేనే వ్యాక్సిన్ మార్కెట్ లో అందుబాటులో వస్తుంది. ఇటీవల  ఓ భారతదేశ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ ( DCGI) సైతం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన నిమ్స్ లో జూలై 7 నుంచి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నారు. 

కోవిడ్ 19 వైరస్ కు వ్యాక్సిన్ కోసం బారత్ సహా అగ్రదేశాలు రాత్రింబవళ్లు పని చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల వ్యాక్సిన్ లు మనుష్యులపై  రెండో దశ ప్రయోగాల్ని కూడా పూర్తి చేశాయి. మరి కొన్ని చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech ) సైతం ముందంజలో ఉంది. పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ( NIV) తో కలిసి ఈ కంపెనీ కోవ్యాక్సిన్ (Covaxin)  పేరుతో కోవిడ్ 19 వైరస్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ అంటే మనుష్యులపై ప్రయోగించేందుకు డీసీజీఐ ఇటీవలే అనుమతిచ్చింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కేజీహెచ్ ( KGH)  తో పాటు హెదరాబాద్ లోని నిమ్స్ ( NIMS Hyderabad) ఆసుపత్రి ఉంది.  ఐసీఎంఆర్ ( ICMR) సూచనల మేరకు నిమ్స్ లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను జూలై 7 నుంచి ప్రారంభించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు. రెండు ఫేజ్ లలో ఈ ట్రయల్స్ ఉంటాయని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. వ్సాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని..చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని  నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. మొదటి ఫేజ్ 28 రోజులుంటుందన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత రెండ్రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని పరిశీలిస్తామన్నారు. Also read: Karnataka: కర్నాటకలో కరోనా కల్లోలం: 32 మంది పదో తరగతి విద్యార్ధులకు సోకిన కరోనా 

భారతదేశంలో దేశీయంగా అభివృద్ది చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. బహుశా అందుకే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News