KCR Health Status: కరోనా బారిన పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన రేగుతోంది. స్వల్ప లక్షణాలతో ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) పంజా విసురుతోంది. ఈసారి రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఎవర్నీ వదలడం లేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm Kcr ) కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులుగా కరోనా సంబంధిత స్వల్ప లక్షణాలుంటే ర్యాపిడ్ టెస్టులు (Rapid Test) నిర్వహించగా..పాజిటివ్‌గా తేలింది.సాధారణ జ్వరం, జలుబు లక్షణాలుండటంతో సిద్ధిపేటలోని ఆయన సొంత ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్( Isolation) ‌లో వెళ్లారు. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ( Nagarjuna saga Bypoll) ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌( Nomula Bhagat) కు మద్దతుగా హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. అనంతరం నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.


ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఓ వైద్య బృందం నిరంతరం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు.అయితే హఠాత్తుగా కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ( Yasoda Hospital) కి తీసుకెళ్లారనే సమచారం ఆందోళన కల్గిస్తోంది. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. నిలకడగా ఉంటే యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరమేముందని అంటున్నారు. అయితే కేవలం సాధారణ హెల్త్ చెకప్, సిటీ స్కాన్ కోసమే యశోద ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 


Also read: Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, తాజాగా 20 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook