Rythu Bandhu Scheme: తెలంగాణ రైతులకు శుభవార్త, రేపటి నుంచే అన్నదాతలకు రైతుబంధు సాయం
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు కోటిన్నర ఎకరాల భూములకుగానూ రైతుబంధు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 15 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు. ఈ ఏడాది వర్షాకాలం మొదలైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతలకు వానాకాలం రైతుబంధు నగదు పంపిణీకి అంతా సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి రైతుబంధు నగదు బ్యాంకు ఖాతాలలో జమ కానుంది.
ఈ ఏడాది మొత్తం కోటిన్నర ఎకరాలకు రైతుబంధు లభించనుంది. 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 2.81 లక్షల మంది కొత్త రైతులు ఉన్నారు. అదే విధంగా 66,311 ఎకరాల భూమి అధికంగా సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని రైతులకు రేపటి నుంచి వారం రోజుల్లో రైతుబంధు (Rythu Bandhu scheme) వర్షాకాలం నగదు బ్యాంకు ఖాతాలకు జమ కానుంది.
Also Read: Rythu Bandhu scheme June 2021 installment: రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
భూమి అత్యధికంగా నల్లగొండలో ఉండగా, అత్యల్పంగా మేడ్చల్ జిల్లా ఉంది. మొత్తంగా రైతు బంధు పంపిణీలో భాగంగా రూ.7,508.78 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం (Telangana CM KCR) బ్యాంకులకు అందించింది. ఆయా బ్యాంకులు రైతుబంధు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఆ నగదును రూ.5వేల మేర జమచేయనున్నారు. ధరణి పోర్టల్ రావడంతో మ్యుటేషన్లు పరిష్కారమయ్యాయి. కల్తీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులపై పీడీ యాక్టు (PD Act) కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
Also Read: Etela Rajender సంచలన వ్యాఖ్యలు, Harish Raoకు సైతం అవమానాలు జరిగాయన్న ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook