Bonalu 2024: బోనాల చెక్కుల పంచాయితీ.. నేలపై కూర్చోని మాజీ మంత్రి సబితా ఆగ్రహం
Sabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
Sabitha Indra Reddy Protest: తెలంగాణలో ఆషాఢ మాసం అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతుంటాయి. పదేళ్లలో ఎలాంటి వివాదం లేకుండా సజావుగా బోనాల పండుగ జరగ్గా.. ప్రస్తుతం మాత్రం వివాదాస్పదమవుతోంది. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మొదలుకుని గోల్కొండ బోనాలు.. మిగతా ఆలయాల్లో కూడా బోనాల నిర్వహణ విమర్శల పాలవుతోంది. బోనాలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల ఘర్షణలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ప్రొటోకాల్ వివాదం రాజుకుంటోంది. తాజాగా మహేశ్వరంలో చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేలపై కూర్చోని ఆందోళన చేశారు.
Also Read: Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్ డే
మహేశ్వరం నియోజకవర్గం ఆర్‌కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కుల పంపిణీ సోమవారం నిర్వహించారు. అయితే అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డిని వేదికపైకి పిలవలేదు. కాంగ్రెస్ నాయకుడిని నిలిచి అతడితో చెక్కుల పంపిణీ చేపట్టారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్
'ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదిక పైకి ఆహ్వానించవద్దు' అని అధికారులకు సబితా చెప్పారు. అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలసి ఆమె బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలు కొనసాగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకుండా ఏ అధికారం లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీలకు బోనాల పండుగ చెక్కులను పంపిణి చేశారు.
మల్కాజిగిరిలోనూ..
బోనాల పండుగ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం లోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి వాణి నగర్ లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్యకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కాదని అతడితో చెక్కులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి