Saffron Cultivation In Siddipet: కాశ్మీర్ ని అందరూ భూతల స్వర్గంగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అరుదైన పండ్లు, పూలు లభిస్తాయి. అలాగే ప్రదేశాలు కూడా చూడడానికి ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ముఖ్యంగా కాశ్మీర్ రైతాంగం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ యాపిల్స్ తో పాటు కుంకుమ పువ్వు, అక్రోట్స్, ఇతర సుగంధ ద్రవ్యాలను సాగు చేస్తారు. మరికొంతమంది అయితే స్ట్రాబెరీలు, బత్తాయి పండ్లను కూడా పండిస్తారు. అయితే కాశ్మీర్ కుంకుమపువ్వు కి ఎంతో ప్రసిద్ధి.. కేవలం కుంకుమపువ్వు ఇక్కడి వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాశ్మీర్లో ఎప్పుడు మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాబట్టి కుంకుమపువ్వు పెరగడానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కుంకుమపువ్వు ఇప్పుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కూడా సాగవుతోంది. కొంతమంది రైతులు సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామంలో కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. ఈ కుంకుమపువ్వు తెలియని వారు ఉండరు.. ఎందుకంటే దీనిని అన్ని రకాల స్వీట్లతోపాటు కొన్ని వంటకాలు రంగు, రుచిని పెంచేందుకు వినియోగిస్తూ ఉంటారు. ఈ పువ్వు అన్ని పువ్వుల కంటే చాలా ఖరీదైందిగా భావించవచ్చు. గ్రాములు కొనుగోలు చేయాలంటేనే కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఖరీదైన పువ్వు తెలంగాణలో సాగు చేయడం చాలా విశేషం. 


ఈ కుంకుమపువ్వు ఎక్కువగా చలి ప్రదేశాలైన హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ లాంటి కొన్ని అరుదైన ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామంలో కూడా పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. DXN అనే కంపెనీ వారు కుంకుమపువ్వు పెరగడానికి కొన్ని కృత్రిమ చల్లని ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుచేసిన ఈ చల్లని ప్రదేశాలలోనే కుంకుమపువ్వు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుంకుమ పువ్వు కు సంబంధించిన మొక్కలను కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ చల్లని ప్రదేశాల్లో నాటి సాగు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఒక తులం కుంకుమపువ్వు రూ.300 పైగా ఉండగా.. గ్రాములలో కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు పెట్టాల్సిందే. 


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్


సిద్దిపేటలో ఈ కుంకుమ పువ్వును చాలా అరుదైన పద్ధతిలో సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన కోల్డ్ రూములను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వెదర్ను పరీక్షిస్తూ కుంకుమపువ్వు మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ మొక్కలు నాటిన నాలుగు నెలలకు పువ్వు వస్తుంది. అప్పటికి పంట చేతికి వస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా కాశ్మీర్ లో సాగయ్యే కుంకుమపువ్వు సిద్దిపేటలో పెరగడం చాలా గ్రేట్ అందరూ అంటున్నారు.


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.