Sankranti Holidays for Inter colleges in Telangana: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు (Sankranti 2022)  ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది. తిరిగి ఈ నెల 17వ తేదీన కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ కాలేజీలకు సెలవులు వర్తించనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ప్రకటన విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ, ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల 11 నుంచి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ... ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదలతో మూడు రోజులు ముందుగానే సెలవులు ఇచ్చింది. మెడికల్ కాలేజీలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ కాలేజీల సెలవులకు సంబంధించి తాజాగా ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.


అకడమిక్ విషయానికి వస్తే... ఇంటర్మీడియట్ (Telangana Educational Institutions) పరీక్షల ఫీజు చెల్లింపు గడువు షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఈ నెల 5 నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. గడువు దాటితే రూ.100 ఫైన్‌తో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రూ.500 ఫైన్‌తో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, రూ.1000 ఫైన్‌తో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు, రూ.2వేలు ఫైన్‌తో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక గతేడాది ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు బోర్డు అవకాశం కల్పించింది.


Also Read: ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను! రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook