Diwali Celebrations 2022: దీపావళి పండగ అంటేనే నగరం టపాసుల మోతతో మార్మోగిపోతుంటుంది. టపాసులకు దూరంగా ఉండి ఈకో ఫ్రెండ్లీ దీపావళి పండగ జరుపుకుని వాయు కాలుష్య నివారణకు తోడ్పడాల్సిందిగా ప్రభుత్వాలు, ఎన్జీఓ సంస్థలు ఎంత చెప్పినా, ఎంత అవగాహన కల్పించినా వినకుండా టపాసులు కాల్చితేనే పండగ అన్న చందంగా ఉంటుంది కొందరి తీరు. అయితే, అలా టపాసులు కాల్చడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా జీవిత కాలానికి సరిపోయే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లో పలు చోట్ల అలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రమాదపుటంచున బాణాసంచా కాల్చుతూ అవి మిస్ ఫైర్ అయిన ఘటనల్లో ఆస్పత్రిపాలైన చిన్న పిల్లల కేసులు ఎక్కువగా కనిపించాయి. అందులో చేతులు స్వలంగా కాలిన గాయాలతో బయటపడిన కేసులు కొన్ని కాగా ఇంకొన్ని ఘటనల్లో టపాసుల నుంచి వెలువడిన నిప్పు కనికలు వచ్చి కంట్లో పడిన కేసులు ఉన్నాయి. దీంతో నగరంలో పలు ఆస్పత్రులు వద్ద ఇలాంటి పేషెంట్ల తాకిడి కనిపించింది. 


[[{"fid":"249756","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg","field_file_image_title_text[und][0][value]":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg","field_file_image_title_text[und][0][value]":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg"}},"link_text":false,"attributes":{"alt":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg","title":"patients-with-eye-burn-injuries-on-diwali-2022.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


కాగా అధిక శాతం ఘటనల్లో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని ప్రముఖ నేత్ర చికిత్సాలయం సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతూ కనిపించారు. ప్రతీ దీపావళి పండగకు ఇలాంటి కేసులు వస్తున్నందున ఈసారి కూడా పండగ వేళ సైతం ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రికి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని అదనపు సంఖ్యలో వైద్యులు, సిబ్బందిని విధుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే అని కాకుండా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు ఈ కేసుల సంఖ్య కూడా ఇంకాస్త అధికంగానే ఉంది.


Also Read : Revanth Reddy: కాంగ్రెస్ అంతానికి టీఆర్ఎస్, బీజేపీ కుట్ర! మునుగోడు రావాలని కేడర్ కు రేవంత్ రెడ్డి పిలుపు


Also Read : Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు? మునుగోడులో ఏం జరుగుతోంది?


Also Read : Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడి! మూడు సభలు.. ఆరు గొడవలతో మునుగోడులో రచ్చరచ్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి