Revanth Reddy: కాంగ్రెస్ అంతానికి టీఆర్ఎస్, బీజేపీ కుట్ర! మునుగోడు రావాలని కేడర్ కు రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంఛన్ దొరా అని బానిసలవుదామా.. లే నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 24, 2022, 04:12 PM IST
  • పార్టీ కేడర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • మునుగోడుకు తరలిరావాలని పిలుపు
  • కాంగ్రెస్ పై కుట్రలు జరుగుతున్నాయన్న రేవంత్
Revanth Reddy: కాంగ్రెస్ అంతానికి టీఆర్ఎస్, బీజేపీ కుట్ర! మునుగోడు రావాలని కేడర్ కు రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కేడర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేమన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తిన్నాయని లేఖరో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పథకరచన చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.  అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్షకట్టారని మండిపడ్డారు దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయని.. కాంగ్రెస్ బిక్షతో ఎదిగివాళ్లే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్ లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని టీఆర్ఎస్ విచ్చలవిడిగా ఉపయోగిస్తోందని అన్నారు. రెండు పార్టీలు అడుగడుగున్నా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ పై గుర్తుల స్థానంతో పాటు  అడుగడుగున్నా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని చెప్పారు.పవిత్రమైన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి.  ఆడబిడ్డ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడులకు తెగబడ్డారని అన్నారు. బీజేపీ అభ్యర్థే స్వయంగా దాడికి దిగడం దారుణమన్నారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్ఠులుగా ఉందామా!? తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని  ఈ కుట్రలు అంటూ ప్రశ్నించారు.

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంఛన్ దొరా అని బానిసలవుదామా.. లే నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నలు మూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు ఉన్న పళంగా కదలి రావాలని పిలుపిచ్చారు. మునుగోడులో కలిసి కదం తొక్కుదామన్నారు. ప్రాణమో... ప్రజాస్వామ్యమో తాడోపేడో తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు అంతా కలిసి రావాలని పిలుపిచ్చారు రేవంత్ రెడ్డి. నికార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు కదలిరా అని పిలుపిచ్చారు. మీరే నా బలం... నా ధైర్యం. లాఠీ ఐనా, తూఠా ఐనా మీ ముందు నేనుంటా. మనల్ని ఏకాకుల్ని చేసే కుట్రలు తిప్పి కొడదాం. సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. ఈ క్షణమే కదలండి... మీ కోసం మునుగోడులో ఎదురు చూస్తుంటా అంటూ పార్టీ కేడర్ కు లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Also Read : క్లాస్ సినిమాలా.. అబ్బే వద్దండీ అంటున్న ఆడియన్స్.. థియేటర్ కు రావాలంటే ఆమాత్రం ఉండాల

Also Read : India Pakistan Match: ఇండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న సుందర్ పిచాయ్.. పాక్‌ ట్రోలర్‌కు స్ట్రాంగ్  కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News