హైదరాబాద్‌లో నెల రోజుల వ్యవధిలోనే మరో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు బట్టబయలైంది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రెండు పైవ్ స్టార్ హోటల్స్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ సెక్స్ రాకెట్‌లో సినీ తారలని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా బంజారాహిల్స్‌లో ప్రముఖులు వుండే ఓ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఓ పథకం ప్రకారం దాడి చేసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని మరో ముగ్గురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. వారిలో ఒకరు రష్యన్ కాగా మిగతా ఇద్దరిలో ఒకరు ముంబై, మరొకరు బెంగాల్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌మేన్ కురియన్ తరయిల్ జాకబ్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన యమల మేరి, బీహార్‌కి చెందిన పంకజ్ ముండల్ వున్నారు. మరో నిందితుడు పరారీలో వున్నట్టు టాస్క్‌ఫోర్స్ కమిషనర్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంజారాహిల్స్‌లోని అపార్ట్‌మెంట్స్‌లో రెండు ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో సెక్స్ వర్కర్‌కి రోజుకు రూ.16,000 చెల్లించి వారిని ముంబై, కలకత్తా, ఢిల్లీ నుంచే కాకుండా కస్టమర్ల డిమాండ్‌ని బట్టి రష్యా నుంచి కూడా వారిని రప్పించే బాధ్యతలని జాకబ్ చూసుకోగా.. జాకబ్‌కి విటులని తీసుకొచ్చే పనిలో మేరీ, పంకజ్ ముండల్ నిమగ్నమైనట్టు పోలీసులు తెలిపారు. 


2011లోనూ జాకబ్ ఓసారి ఇదే నేరం కింద అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చిన అనంతరం కూడా మళ్లీ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఇలా పోలీసులకి చిక్కాడు జాకబ్. ఈ దాడుల్లో నిందితుల నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.40,000 నగదు, ఆరు సెల్ ఫోన్లు, ఓ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.