Sexual harassment in online classes: సంగారెడ్డి: ఆన్‌లైన్ క్లాసుల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్‌ వినయ్ రాజ్‌ను సంగారెడ్డి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సంగారెడ్డిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ బాలిక ఫోన్‌కు వినయ్ రాజ్ అసభ్యకరమైన సందేశాలు పంపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలిక నగ్న వీడియోలు (గాళ్ న్యూడ్ వీడియోస్) వాట్సాప్ చేస్తేనే పరీక్షల్లో మార్కులు వేసి పాస్ చేస్తానని, లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో లెక్చరర్ ఆగడాలపై బాలిక తల్లిదండ్రులు సంగారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Also read : Kerala Lockdown: కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా ఉధృతి, సంపూర్ణ లాక్‌డౌన్‌


బాలిక కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సంగారెడ్డి పోలీసులు.. ఒంగోలులో నివాసం ఉంటున్న వినయ్‌‌రాజ్‌పై పొక్సో చట్టం (POCSO act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Also read : Schools Reopen Decision: స్కూళ్లు, కళాశాలలు తెరిచే నిర్ణయం ఎవరిది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook