Kerala Lockdown: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ సంక్రమిస్తోంది. కేరళలో పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
దేశంలో కరోనా వైరస్(Corona virus)ఉధృతి తగ్గుముఖం పట్టినా..2-3 రోజుల్నించి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది. ముఖ్యంగా కేరళలో మరోసారి సంక్రమణ వేగం పుంజుకుంటోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏకంగా 22 వేల కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా రోజుకు 35-38 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ఒక్కసారిగా 43 వేల కేసులకు చేరింది. దేశంలో ప్రస్తుతం 4 లక్షల 3 వేల 840 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.
కేరళలో(Kerala)కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు జూలై 31, ఆగస్టు 1 రెండ్రోజులపాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్(Kerala lockdown)విధించారు.అటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందం కేరళకు రానుంది. కేరళలో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాల్ని ఈ బృందం పరిశీలించనుంది. కేరళలో నమోదవుతున్న కేసుల్లో ఉన్న వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షలు చేయనున్నారు.
Also read: Schools Reopen Decision: స్కూళ్లు, కళాశాలలు తెరిచే నిర్ణయం ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook