Schools Reopen Decision: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీరని నష్టం కలిగింది. వరుసగా రెండవ ఏడాది స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో తిరిగి స్కూళ్లను తెరిచే విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసింది కేంద్రం.
దేశంలో కరోనా వైరస్(Coronavirus)కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే వరుసగా రెండవ ఏడాది స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు కేసులు తగ్గుతున్నా...కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) తీవ్రత ఎక్కువంగా ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో స్కూళ్లు, కళాశాలలు తిరిగి తెరవాలా లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలో స్కూళ్లు తిరిగి ప్రారంభించే విషయంలో నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం అంతగా ఉండకపోవచ్చనేది కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయం. టీచర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా పూర్తి కానందున స్కూళ్లు తిరిగి తెరిచే విషయంలో సందిగ్దం నెలకొంది. అయితే వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ వేగవంతం చేయడమనేది రాష్ట్రాలపైనే ఆధారపడి ఉందని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువమంది ఉపాధ్యాయులు వ్యాక్సిన్ ఇంకా తీసుకోనందున..స్కూళ్లను తిరిగి తెరవడంపై(Schools reopen)ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 9.54 మంది టీచర్లే వ్యాక్సిన్ తీసుకున్నారు. స్కూళ్లలో వ్యాక్సిన్ శాతం, ప్రస్తుత పరిస్థితి పై సీబీఎస్ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యాసంస్థలు, విద్యాబోర్డుల నుంచి నివేదిక సమర్పించాలని కేంద్ర విద్యామంత్రిత్వశాఖ కోరింది.
Also read: Pension Scheme: కోవిడ్‌తో మరణిస్తే..కుటుంబసభ్యులకు జీవితాంతం పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook