సోషల్ మీడియాలో Friend request పంపించినంత మాత్రాన్నే అది వారిపై Sexual exploitation పాల్పడటానికి ఆహ్వానంగా పరిగణించలేమని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్‌పై ఓ 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించడం సర్వసాధారణమైందని.. ప్రజలు నెట్వర్కింగ్, జ్ఞానం, వినోదం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని.. అలాంటప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినంత మాత్రాన్నే తమతో లైంగిక సంబంధం ఏర్పర్చుకోవడానికి దానిని ఓ ఆహ్వానంగా భావించవచ్చని ఎవరు చెప్పారని హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు ప్రశ్నించింది.
Facebook ద్వారా మైనర్ బాలికకు పరిచయమైన నిందితుడు.. 2019 నవంబర్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఆ అమ్మాయి తన అసలు వయస్సును దాచిపెట్టి అబద్దం చెప్పిందని కోర్టు ఎదుట బుకాయించాడు. పిటిషనర్ వాదనపై స్పందించిన జస్టిస్ చిట్కారా.. సోషల్ మీడియాలో ఎకౌంట్ ఉన్నవాళ్లంతా తమ అసలు వివరాలు గోప్యంగా ఉంచడం అనేది సర్వసాధారణమని అన్నారు. ఏదేమైనా.. నిందితుడు బాధితురాలిని వ్యక్తిగతంగా కలిసినప్పుడైనా ఆ అమ్మాయి Minor girl అని అర్థం చేసుకోవాలి కదా అంటూ నిందితుడిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.
"బాధితురాలు నిందితుడికి Friend request పంపినంత మాత్రాన్నే ఆమెతో లైంగిక సంబంధాలు ఏర్పర్చుకునే హక్కు, స్వేచ్ఛ అతనికి లేదు" అని ఈ సందర్భంగా కోర్టు స్పష్టంచేసింది. భారత్‌లో 66 శాతం సోషల్ మీడియా యూజర్స్ 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గలవారేనని.. ఒకవేళ మైనర్స్ సోషల్ మీడియాను ఉపయోగించినప్పటికీ... లైంగిక సంబంధాలు ( Sexual relations ) ఏర్పర్చుకోవడం కోసమే వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారనుకోవడం తప్పే అవుతుందని హై కోర్టు వ్యాఖ్యానించింది.
Also read : Farmers protest vs Twitter accounts: ఆ ఎక్కౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్రం నోటీసులు
అన్నింటికిమించి ఒకవేళ మైనర్ బాలిక సమ్మతితో యువకుడు లైంగిక సంబంధం ఏర్పర్చుకున్నప్పటికీ.. POCSO Act ప్రకారం మైనర్లతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడం కూడా నేరమే అవుతుందని హై కోర్టు గుర్తుచేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook