Siasat Daily Managing Editor Zaheeruddin Ali Khan Died: హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి చోటుచేసుకుంది. గద్దర్‌ని కడసారి చూసుకుని, కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో సినీ, వ్యాపార, రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు తరలి రావడంతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతున్న అల్వాల్ లోని మహాబోధి పాఠశాల ఆవరణలో భారీ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీనియర్ జర్నలిస్ట్, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గద్దర్ ఆకస్మిక మరణంతో ఇప్పటికే శోక సంద్రంలో ఉన్న జనం గద్దర్ అంత్యక్రియలు కూడా పూర్తి కాక ముందే ఇలాంటి అపశృతి చోటుచేసుకుని సీనియర్ జర్నలిస్ట్ మృతి చెందారన్న వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గద్దర్‌తో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్‌కి ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మంచి సాన్నిహిత్యం, అనుబంధం ఉంది. ఇరువురి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే తన మిత్రుడు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికేందుకు గద్దర్ అంత్యక్రియలు జరుగుతున్న ఆల్వాల్‌లోని మహా బోధి పాఠశాలకు వచ్చారు.


జహీరుద్దీన్ అలీ ఖాన్ తరహాలోనే గద్దర్ సాన్నిహిత్యం ఉన్న ఎంతోమంది రాజకీయ, సినీ, సాహిత్య ప్రముఖులు కూడా అక్కడికి రావడం, అలాగే అభిమానులు కూడా జన సంద్రమై తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలోనే దురదృష్టవశాత్తుగా సియాసత్ ఉర్దూ డైలీ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందడంతో మరోసారి నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గద్దర్ మృతి నుండి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడిలా మరొక పాత్రికేయ ప్రముఖుడు ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది.


ఇది కూడా చదవండి :  Gaddar Last Statement: గద్దర్.. తుది వరకు పోరాటమే.. జనం కోసం ఆరాటమే..


నిన్న రాత్రి సైతం గద్దర్ పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు ఎల్బీ స్టేడియానికి వచ్చిన జహీరుద్దీన్ అలీ ఖాన్.. అక్కడ మీడియా మిత్రులు, రాజకీయ ప్రముఖులతో మాట్లాడుతూ గద్దర్ అన్నతో తనకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గద్దరన్న లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిదని చెబుతూ ఉద్వేగానికిి లోనయ్యారు. తెలంగాణ వాదుల్లో ఒకరైన జహీరుద్దీన్ అలీ ఖాన్.. తెలంగాణ ఉద్యమం సమయంలో పాత్రికేయుడిగా చురుకైన పాత్ర పోషించారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు తన వంతు కృషిచేసిన ఒక పాత్రికేయుడు ఇలా ఉన్నట్టుండి మనకి దూరం అవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది అంటూ పలువురు రాజకీయ ప్రముఖులు ట్విటర్ ద్వారా తమ సంతాప సందేశాలను పంచుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


ఇది కూడా చదవండి :  Revanth Reddy About Gaddar: గద్దర్ అన్న ఆశయం అదే.. ప్రజా గాయకుడి గురించి రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి