Telangana Weather Updates: దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఆవహించిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి  ఎగువన విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు తెలంగాణ రాష్ట్రమంతా క్రమంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి, మరుసటి రోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పిడుగుల పడే ప్రమాదముంది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, వికారాబాద్ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ


గత వారం రోజుల్నించి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకం ఇక ఉపశమనం పొందనుంది. రాష్ట్రమంతా రుతు పవనాల ప్రబావంతో విస్తారంగా వర్షాలు పడనుండటంతో వాతావరణం చల్లబడనుంది. హైదరాబాద్‌లో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షం పడవచ్చు. గాలిలో 76 శాతం తేమ ఉంది. ఇక రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook