వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకువచ్చిన కారు ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరు చనిపోగా, మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం. ఈ ఘటన సంగెంలోని తీగరాజుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. వరంగల్(Warangal) నుంచి తొర్రూరుకు కొందరు వ్యక్తులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో కొంకపాక వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.


Also Read: Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో రికార్డు ధరలు


కారు కాలువలోకి దూసుకెళ్లిన(Car Accident) వెంటనే అక్కడున్న కొందరు తాడుకోసం వెతుకున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని తెలుస్తోంది. విజయ్‌ భాస్కర్‌ అనే వ్యక్తి క్షేమంగా ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకోగా, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఇద్దరిలో లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన మహిళ ఉన్నారు. ఆమె పర్వతగిరి మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 


Also Read: 7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PFతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు


ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోతే కారు కాలువలోకి దూసుకెళ్లిందని విజయ్ భాస్కర్ చెబుతున్నాడు. మరోవైపు ప్రమాద సమయంలో ఎస్సారెస్పీ కాలువో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయింది. సమాచారం తెలుసుకున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook