తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని విముక్తి కలిగించడమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. దీని కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 19న పిటిషన్ వేస్తానని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవారి నగలు మాయం చేశారని.. నిధుల కోసం తవ్వకాలు చేపట్టారంటూ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీలో నెలకొన్న వివాదాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీకి విముక్తి కల్గించి టీటీడీ నిర్వహణను సాధువులకు అప్పగించాలనేది సుబ్రమణ్యస్వామి ప్రధాన డిమాండ్ . దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయన ఈ విషయంలో న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు.