Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!
Meat Shops Closed Tomorrow: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రేపు ఏప్రిల్ 21 ఆదివారం రోజు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు బంద్ పాటిస్తున్నారు. కారణం ఏంటో తెలుసుకుందాం.
Meat Shops Closed Tomorrow: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రేపు ఏప్రిల్ 21 ఆదివారం రోజు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు బంద్ పాటిస్తున్నారు. రేపు జైనులకు ప్రత్యేకమైన మహవీర్ జయంతి సందర్భంగా హైదరబార్ చుట్టుముట్టు ప్రాంతాల్లోని మాంసం విక్రయదారులు బంద్ పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో జైన్ మతానికి చెందినవారు ఎక్కువ సంఖ్యంలో ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చికెన్, మటన్ దుకాణాలను మూసి ఉంచాల్సిందిగా ఆదేశించింది. మహావీర్ జయంతి ఆదివారం 21 సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలను అతిక్రమించి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలను జారీ చేశారు.
జైన్ కమ్యూనిటీకి చెందిన వారు పెద్ద సంఖ్యలోనే భాగ్యనగరంలో ఉన్నారు. వీళ్లు మహావీర్ జయంతిని పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాంసం దుకాణాలను బంద్ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ఇక సోమవారం నుంచి యథావిథిగా చికెన్, మటన్ విక్రయాలు కొనసాగనున్నాయి.
ఇదీ చదవండి: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..
మహవీర్ జయంతి 2024:
ముఖ్యంగా మహావీర్ జయంతి జైన్ మతస్థులకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకుంటారు. ఈరోజున చివరి, 24వ జైన తీర్థంకారుడు పుట్టిన పవిత్రమైన రోజుగా చరిత్రలు చెబుతున్నారు. ప్రపంచ శాంతి సామరస్యం సాధించడంలో జైన మతానికి ప్రత్యేక ప్థానం ఉందని చెప్పొచ్చు. ఈ పవిత్రమైన రోజు మహావీరుడికి సంబంధించిన శ్లోకాలను పఠిస్తారు జైనమతస్థులు. అంతేకాదు జైన దేవాలయానికి వెళ్లి రథయాత్ర కూడా నిర్వహిస్తారు. జైన మతంలో దానానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.
ఇదీ చదవండి: వెయ్యిరెట్లు భక్తులు ఎక్కువగా వచ్చారు.. గరుడ ప్రసాదంపై క్లారీటీ ఇచ్చిన ఆలయ పూజరీ..
వైశాలి రాజ్యానికి పాలించిన రాజు సిద్ధార్థ, త్రిశలకు మహవీరుడు జన్మించాడు. దిగంబర జైనుల ప్రకారం మహవీరుడు 615 BC సమయంలో జన్మించాడని నమ్ముతారు. ఇక శ్వేతంబరులు మాత్రం 599BC సమయంలో జన్మించాడని అంటారు. మహవీర్ జయంతిని హిందూ క్యాలెంటర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్ర నవరాత్రులు 13వ రోజున నిర్వహిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook