Sunitha Laxma Reddy taken charge as TWCC: హైదరాబాద్: తెలంగాణ తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమెతోపాటు క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు. బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఆరుగురు సభ్యులు బాధ్య‌త‌లు చేపట్టారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ర్ట ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR), పలువురు అధికారులు పాల్గొన్నారు. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. అయితే ఈ రోజు నుంచి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ఆరుగురు సభ్యులు ఐదేళ్లపాటు పదవిలో కొనసాగ‌నున్నారు. Also Read: Avika Gor Photos: బికినీలో రెచ్చిపోయిన చిన్నారి పెళ్లి కూతురు


మెదక్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2019లో టీఆర్ఎస్ (TRS) ‌లో చేరారు. ఈ క్రమంలోనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ (Telangana Womens Commission) ‌గా నియామిస్తూ అధికార పార్టీ గతనెలలో నిర్ణయం తీసుకుంది.


Also Read: CM KCR: నేడు భూపాలపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook