వరంగల్: మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం జనగామ సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పొన్నాల కోసం సీటు వదులుకునేందుకు కోదండరాం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో పొన్నాల పేరు లేదు. ఈ పరిణామం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జనగామ సీటు విషయంలో కాంగ్రెస్ ఎందుకు తేల్చుకోలేపోతుంది. అధిష్టానం మదిలో ఏమంది..పొన్నాల పక్కన పెట్టాలనుకుంటుందా..? కోదండరాంను బరిలోకి దించాలనే ఉద్దేశంతోనే దీన్ని హోల్డ్ లో పెట్టిందా అనేది తేలాల్సి ఉంది. దీంతో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై  ఉత్కంఠత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనగామ జగడం ఎందుకు ?


మహాకూటమి పొత్తులో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని టీజేఎస్ కు కేటాయించి..ఆ స్థానంలో ఆ పార్టీ చీఫ్ కోదండరాంను బరిలోకి దిగాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనికి కోదండరాం కూడా అంగీకరించారు. అయితే ఈ స్థానాన్ని గట్టిగా కోరుతున్న మాజీ మంత్రి పొన్నాల..ఎట్టిపరిస్థితులోనూ సీటు వదులుకునేందు సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. దీంతో ఒక మెట్టుదిగి వచ్చిన కోదండరాం.. ఆ సీటు వదులుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన రెండో జాబితాలో జనగామ నియోజకవర్గం పేరు లేదు.. పొన్నాల ఊసే లేదు.. దీంతో ఈ అంశం రాకీయవర్గాల్లో చర్చనీయంగా మారింది.


జనగామ సీటుపై పొన్నాల ధీమా !
మరోవైపు పొన్నాల జనగామ సీటు తనకే దక్కుతందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా  పొన్నాల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 75 స్థానాలు మాత్రమే ప్రకటించిందని .. ప్రకటించాల్సిన స్థానాలు ఇంకా మిగిలే ఉన్నాయని.. అందులో జనగామ కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలని మీడియాతో అన్నారు. అంతే కానీ దీన్ని భూతాద్దంలో పెట్టి చూడకండి... గత 30 ఏళ్ల నుంచి తాను ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించాను. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తా.... కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగానే నిలబడతాని పొన్నాల బల్లగుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వడం ఖాయం..ఇందులో ఎలాంటి అపోహనలకు..అనుమానాలకు తావులేదని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు.