కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ; అభ్యర్ధులు వీరే..
ఒకవైపు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో గులాబీ దళం దుసుకుపోతోంది...మరోవైపు మహాకూటమి కారణంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయం ఇంకా కొలిక్కిరాలేదు. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్న కాంగ్రెస్ .. నవంబర్ 2న మూహర్తం ఖారారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సైతం ధృవీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నందున.. ఈ కూటమిలోని సీట్లను వదిలేసి వివాదాలకు దూరంగా ఉన్న సీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.ఈ సీట్లకు చెందిన జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. కాగా కాంగ్రెస్ ప్రకటించనున్న జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం...
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఇదే:
హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మధిర- మల్లు భట్టి విక్రమార్క
కొడంగల్ - రేవంత్ రెడ్డి
జనగాం - పొన్నాల లక్ష్మయ్య
నాగార్జున సాగర్ - జానారెడ్డి
జహీరాబాద్ - గీతారెడ్డి
ఆలేరు -బిక్షమయ్యగౌడ్
నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
గద్వాల్ - డీకే అరుణ
వనపర్తి - చిన్నారెడ్డి
జగిత్యాల - జీవన్ రెడ్డి
నర్సంపేట - మాధవ్ రెడ్డి
గోషామహల్ -ముఖేష్ గౌడ్
సనత్ నగర్ - మర్రిశశిధర్ రెడ్డి
నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నాగర్ కర్నూల్ - నాగం
షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి
మంథనీ - శ్రీధర్ బాబు
కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
మహేశ్వరం -సబితా ఇంద్రారెడ్డి
నర్సాపూర్ - సునీత లక్ష్మారెడ్డి
సంగారెడ్డి - జగ్గారెడ్డి
ఖానాపూర్ -రమేష్ రాథోడ్
సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి
పరిగి - రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ -ప్రసాద్ కుమార్
తుంగతుర్తి - అద్దంకి దయాకర్
కామరెడ్డి - షబ్బీర్ అలీ
బోధన్ -సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి -విజయరమణరావు
ఆలంపూర్- సంపత్‌కుమార్
గజ్వేల్- ఒంటేరు ప్రతాప్ రెడ్డి
ఆందోల్- దామోదర రాజనర్సింహ
కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
నర్సంపేట - దొంతిమాధవరెడ్డి
భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి
బోథ్ - సోయం బాపురావు
బాల్కొండ - అనిల్ కుమార్
తొలి జాబితాలో భాగంగా 41 మంది అభ్యర్ధుల జాబితా రెడీ చేసిన కాంగ్రెస్ ...మహాకూటమితో సీట్ల సర్దుబాటు అనంతరం తుది జాబితాను ప్రకటించనుంది. మొత్తం 90కి పైగా సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే మహాకూటమిలోని అభ్య్ధర్ధులు ఎక్కువ సీట్లు అడుగుతుండటంతో 90కి కాస్త అటూ ఇటూ గా పోటీ చేసే అవకాశముంది. ఇదిలా ఉండగా తొలి జాబితాలో సీనియర్లకు మాత్రమే చోటు కల్పించడం గమనార్హం.