Teenmar mallanna: తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. 7200 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్ మల్లన్న.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ముఠా సభ్యుల సంఖ్య 7200 అని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. వీరు జలగలుగా ప్రజలను పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నాయకుడు ఎంత భూమిని కబ్జా చేశారో తన దగ్గర చిట్టా ఉందన్నారు. 15 వేల 14 ఇళ్లకు ఓ దొర చొప్పు తయారు అయ్యారని దుయ్యబట్టారు. వారి నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ప్రజా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 


త్వరలో ప్రజల్లోకి వెళ్లి అన్ని వివరిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తన కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి ఇస్తానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ను మూయించేందుకు కొందరు ప్రయత్నించారని చెప్పారు. 7200 పేరుతో త్వరలో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు తీన్మార్ మల్లన్న.


అంబేద్కర్ ఆశయాలను ముందుకు పోతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. 7200లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలకు సత్వర న్యాయం ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలన్నారు. రాష్ట్రంలో విద్య కూడా కొందరి చేతుల్లో ఉందని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు.  


ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. 7200 కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. జడ్జీల నియామకాల్లోనూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. సమ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలో వెల్లడిస్తామన్నారు తీన్మార్ మల్లన్న.


Also read:Samantha Love: ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత.. మరోసారి లవ్‌‌లో..!


Also read:GST Collections : జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్... ఏప్రిల్ నెలలో వసూళ్లు ఎంతంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook