GST Collections : జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్... ఏప్రిల్ నెలలో వసూళ్లు ఎంతంటే...

GST Collections All Time Record: జీఎస్టీ రూపంలో కేంద్ర ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెల వసూళ్లు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 04:03 PM IST
  • జీఎస్టీ వసూళ్లతో కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం
  • తొలిసారి రూ.1.5 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
  • జీఎస్టీ ఏప్రిల్ నెల వసూళ్ల రిపోర్ట్ విడుదల చేసిన కేంద్రం
 GST Collections : జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్... ఏప్రిల్ నెలలో వసూళ్లు ఎంతంటే...

GST Collections All Time Record: జీఎస్టీ వసూళ్లలో ఈ ఏడాది ఏప్రిల్ నెల వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ వసూళ్లే ఆల్ టైమ్ రికార్డ్. ఏప్రిల్ నెలకు గాను రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత మార్చి నెలలో అత్యధికంగా రూ.1,42,095 కోట్లు జీఎస్టీ కింద వసూలవగా... ఏప్రిల్ నెలలో మరో రూ.25 వేల కోట్లు అధికంగా వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 20 శాతం మేర ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి.

ఏప్రిల్ నెల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.33,159 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.41,793 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.81,939 కోట్లు, సెస్ కింద రూ.10,649 కోట్లు  వసూళ్లయ్యాయి. పన్ను చెల్లింపులను సులభతరం చేయడం, పన్ను చెల్లించనవారిపై కఠిన చర్యల ఫలితంగానే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

రాష్ట్రాలవారీగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో రూ.27,945 కోట్లు, గుజరాత్‌లో రూ.11,264 కోట్లు జీఎస్టీ కింద వసూలైంది. తెలంగాణలో రూ.4955 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4067 కోట్లు జీఎస్టీ కింద వసూలైంది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం పెరగ్గా... ఏపీలో 22 శాతం మేర వసూళ్లు పెరిగాయి. 

Also Read: SVP Trailer Leak: మహేష్ బాబుకు షాక్... సర్కారు వారి పాట ట్రైలర్ లీక్... 

Also Read: TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News