Chakali Ilamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..!
Chakali Ilamma: రేపు (సోమవారం) తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ బర్త్ డే. ఈసందర్భంగా జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Chakali Ilamma: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక సందేశం ఇచ్చారు. చాకలి ఐలమ్మ..బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. రేపు (సోమవారం) జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం చాకలి ఐలమ్మ ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శమన్నారు సీఎం.
హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మ గౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు.
1895లో వరంగల్ జిల్లా కృష్ణాపురంలో ఆమె జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం తన వంతు పోరాటం చేశారు. జమిందార్ల పెత్తనాలపై పోరాటం సాగించారు. ప్రజ గొంతుకై నిలబడ్డారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేశారు. 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు.
Also read:Viral Video: పాఠశాలలో విద్యార్థుల పాడు పని..ఫైర్ అవుతున్న నెటిజన్లు..!
Also read:Bangladesh Accident: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం..24 మంది మృతి..పలువురు గల్లంతు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook