TS Election Schedule 2023: దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క ఛత్తీస్‌గఢ్ మినహాయించి మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే విడతలో వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్లమంది ఓటర్లు నమోదయ్యారు. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 


తెలంగాణలో మొత్తం 3.17 కోట్లమంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 1.58 కోట్లు మంది పురుషులు కాగా మరో 1.58 కోట్లమంది మహిళలున్నారు. ఇందులో దివ్యాంగులు 5 లక్షలమంది, 80 ఏళ్లుపైబడినవారు 4.4 లక్షలమంది ఉన్నారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారు తెలంగాణలో 8.11 లక్షలున్నారు. కొత్త ఓటర్లు 17 లక్షలమంది ఉన్నారు. 


నవంబర్ 3న తెలంగాణ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 10 వరకూ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకూ గడువుంటుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 


Also read: Assembly Elections 2023 Live Updates: నేడే విడుదల.. మరికాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్.. సర్వత్రా ఉత్కంఠ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook