హైదరాబాద్: మునిసిపాలిటీ బిల్లు 2019 సహా మొత్తం ఐదు కీలకమైన చట్టాలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో సమావేశాలు జరగగా.. కొత్త మున్సిపాలిటీ బిల్లు-2019, బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లు, మున్సిపల్‌ నిబంధనల (సవరణ) బిల్లు, రుణ విమోచన కమిషన్‌ నియామక బిల్లు, పంచాయతీరాజ్‌ 2వ సవరణ బిల్లుకు సభ్యుల నుంచి ఆమోదం లభించింది. 


రెండు రోజుల్లో 4 గంటల 44 నిమిషాలు పాటు అసెంబ్లీ కొనసాగగా బిల్లుల ఆమోదం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.