Telangana Assembly session: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం ఉదయం వేర్వేరుగా ప్రారంభమయ్యాయి. శాసనసభ (Assembly) వర్షాకాల సమావేశాల్లో (monsoon session) ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన శాసనసభ్యులకు మొదట సంతాపాలు ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీర్‌ చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్‌, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. శాసనమండలిలో రెహమాన్‌, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కాగా ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బడ్జెట్‌ సమావేశాల (budget session) తర్వాత ఆరు నెలలకు అసెంబ్లీ కొలువుదీరింది. దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం (trs government) సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగింపుతో హుజూరాబాద్‌ (Huzurabad) ఉప ఎన్నికల అంశం సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈసారి కూడా కరోనా నిబంధనలను పాటిస్తూనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.


Also Read : Coronavirus updates: దేశంలో 3 లక్షలకు పైగా తగ్గిన కోవిడ్‌ క్రియాశీల కేసులు


తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్‌ అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారుపై చర్చించారు. ఈ నెల 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి  అక్టోబర్‌ 5 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Also Read : Love Story Review: ‘'లవ్ స్టోరీ'’ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఎలా ఉందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook