Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రపు ఫలితాలు సాధించిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అత్యధి స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. మజ్లిస్‌ కంచుకోట అయిన హైదరాబాద్‌తో సహా అన్నింటా కాషాయ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచించింది. ఈ లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలో పంచ వ్యూహం వేసింది. ఆ వ్యూహంలో భాగంగా 'విజయ సంకల్ప యాత్ర' పేరిట ఐదు యాత్రలు చేపట్టాలని కమల దళం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కార్యాచరణ ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌.. రేవంత్‌ను కలిసిన బొంతు రామ్మోహన్‌


ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 1 వరకు యాత్రలు చేయబోతున్నట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు. యాత్రలో రోడ్ షోలు అధికంగా ఉంటాయని తెలిపారు. యాత్రకి సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని, ఐదు దశల్లో యాత్రలు ఉంటాయని వివరించారు. ఒక్కో యాత్రకు ఒక్కో పేరు పెట్టి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కొమరం భీమ్‌, కృష్ణ, కాకతీయ, భాగ్యనగరి, కృష్ణమ్మ వంటి పేర్లతో యాత్రలు చేపడుతున్నట్లు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. యాత్రలో పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని ప్రణాళిక వివరించారు. ఐదు రథ యాత్రల్లో 33 జిల్లాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 17 సీట్లు గెలిచే విధంగా ప్రణాళిక రచించినట్లు చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏఐఎంఐఎం పార్టీని కూడా మట్టి కరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక


రాష్ట్రంలో తమ పార్టీ గెలిచే స్థానాలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో ప్రధాని మోదీ రావాలని యువత  కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలు సుస్థిరతకు అస్తిరతకు మధ్య జరగనున్నాయని అభివర్ణించారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనపై మీడియా ప్రశ్నించగా.. 'జాతీయ స్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదు. ఇంకా మా ఎన్నికల కమిటీ కూర్చోలేదు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటారు' అని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్‌పై సీఎం విసిరిన సవాల్‌పై స్పందిస్తూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే మేము మేడిగడ్డ సందర్శించాం. ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. కృష్ణా నది అంశంపై ఏపీ, తెలంగాణ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతది' అని స్పష్టం చేశారు.


యాత్రల షెడ్యూల్‌
కొమురం భీమ్ యాత్ర:
ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్
శాతవాహన  యాత్ర: కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల
కాకతీయ యాత్ర : ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్
భాగ్యనగరి యాత్ర: భువనగిరి, సికింద్రాబాద్, హైదారాబాద్, మల్కాజ్ గిరి
కృష్ణమ్మ యాత్ర: మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook