GHMC elections: పవన్ కళ్యాణ్‌ను కలవటంలేదు: బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తేల్చిచెప్పారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తేల్చిచెప్పారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. బీజేపీతో జనసేన కలిసి పనిచేయడం అనేది ఏపీ వరకే పరిమితం అవుతుందని.. అది తెలంగాణకు వర్తించదని ఆయన ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడానికే ఏర్పాట్లు పూర్తయ్యాయని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ పొత్తులు లాంటివేమైనా అనుకున్నా.. తనకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య పొత్తుల గురించి మాట్లాడటానికి మధ్యవర్తులు అవసరం లేదని.. తాను, పవన్ కల్యాణ్ చాలా దగ్గరి వాళ్లమేనని అన్నారు. ఏ విషయం ఉన్నా ఫోన్‌లో మట్లాడుకుంటూ ఉంటాం అని చెబుతూ.. ఏపీలో మత మార్పిడిలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also read : GHMC elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
గ్రేటర్ ఎన్నికల్లో ( GHMC Elections ) పొత్తుల అంశం గురించి మాట్లాడటానికి పవన్ కల్యాణ్‌ను కలుస్తారా అనే సందేహాలకు సైతం చెక్ పెడుతూ తాను పవన్ కళ్యాణ్‌ను కలవటం లేదు అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి