Bandi Sanjay Counter To TRS: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కలకలకం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు వ్యక్తులు భేటీ అయి వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే.. వారికి ఒక్కొకరికి రూ.100 కోట్ల నగదుతో పాటు కాంట్రాక్టులు, పదవులు కట్టబెడతామని ఆఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై పోలీసులు రైడ్ చేసి.. ఆ నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ నలుగురు వ్యక్తులు వెనుక బీజేపీ నేతలు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌ ఓ డ్రామా కంపెనీ అని.. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లు అని ఎవరు చెప్పారని అని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఎక్కడైనా స్వామిజీలు వెళతారా..? అని ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల గుండు మీద రూపాయి పెడితే.. అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరని కౌంటర్ ఇచ్చారు. 


మూడు రోజుల ముందు నుంచే ఎమ్మెల్యేలు భేటీ అయి కుట్ర చేశారని.. మరి వారిని ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తరలించలేదని ప్రశ్నించారు బండి సంజయ్. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే కేసీఆర్ ఈ నాటానికి తెరలేపారని.. త్వరలోనే ఈ నాటకం బయటపడుతుందన్నారు. ఈ నాటకం కేసీఆర్ మెడకే చుట్టుకుంటుందని అన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. ఫామ్‌హౌస్ వాళ్లదే.. ఫిర్యాదు చేసింది వాళ్లేనని.. అందరి ఫోన్ కాల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 


మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో దూమారం రేపుతోంది. అధికార పార్టీ పక్కా ప్లాన్‌తో కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తోందని టీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ వ్యవహారం ఏ ములుపు తిరుగుతుందో చూడాలి మరి..


Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ


Also Read: RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి