Bandi Sanjay: కేసీఆర్.. అసెంబ్లీలో చెంపలేసుకో.. డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్ వార్నింగ్
Bandi Sanjay Fires On Cm Kcr: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం గ్రామం మీదుగా సాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Fires On Cm Kcr: ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తానంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఇండ్ల జాగా ఉన్న వాళ్లందరికీ డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే.. ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ విమర్శించారు. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలుసహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదన్నారు. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీశారని ఫైర్ అయ్యారు. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాంకు వచ్చిన బండి సంజయ్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
'తెలంగాణనే బీజేపీ అడ్డా. ఈ జోష్ చూసే.. కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని సభ నిర్వహించుకున్నాం. ఫామ్ హౌస్‌లో తాగి పడుకుంటున్న కేసీఆర్‌ను బయటికి గుంజుకొచ్చింది బీజేపీ. తెలంగాణలోనే పీకలేనోడు, దేశంలో ఏం పీకుతాడు..? కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువ. కేసీఆర్ ఇంట్లో ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది..' అని బండి సంజయ్ అన్నారు. గతంలో సొంత జాగా ఉన్న వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ఇస్తానని మాట తప్పారని ఫైర్ అయ్యారు.
ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత పత్తా లేకుండా పోతాడని మండిపడ్డారు బండి సంజయ్. అసెంబ్లీ సమావేశాలను పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాడట.. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించాలని సవాల్ విసిరారు. ఎరువులపై రైతులకు దాదాపు 36వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని.. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు.
'కేసీఆర్.. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు. ఐదు సంవత్సరాల్లో దేశం కోసం, ధర్మం కోసం ఏడుసార్లు జైలుకు వెళ్లాను. ప్రజల కోసం ఉద్యమం చేస్తుంటే.. రౌడీషీట్లు పెట్టి, జైల్లోకి పంపిస్తున్నాడు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్. దళితుడిని ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు హామీని అమలు చేయని మూర్ఖుడు కేసీఆర్. గొల్ల కురుమలను మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. అన్ని బీసీ కులాలను మోసం చేసిండు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు. పేదోళ్ల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కేసీఆర్ గడీల్లో తెలంగాణ తల్లి బందీ అయింది' అని బండి సంజయ్ విమర్శించారు.
Also Read: 7th pay commission: కేంద్ర ఉద్యోగులకు మరో బంపర్ గిఫ్ట్.. ట్రావెల్ అలవెన్స్ పెంపు
Also Read: Hyderabad Metro: మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు.. నగర ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook