OBC Leaders Meeting In Hyderabad: పేదల పార్టీ బీజేపీ అయితే బీఆర్ఎస్ పెద్దల పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారని, వారంతా బీజేపీవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ నేతల సమావేశం నిర్వహించారు. జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కష్టపడే కార్యకర్తలను జాతీయ నాయకత్వం గుర్తిస్తుందనేదానికి హన్సరాజ్ గంగారాం నిదర్శనమన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఓబీసీ మోర్చా నేతలు  సమాజం కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని.. ప్రతి ఒక్కరూ బీజేపీవైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి కేసీఆర్ పాలనలో పేదలు, బలహీనవర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.


'పేదల బలిదానంతో తెలంగాణ వచ్చింది. పెద్దలే రాజ్యమేలుతున్నారు. పేదలకు అన్యాయం జరుగుతూనే ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం వస్తేనే న్యాయం జరుగుతుంది. ఎన్నికల సమయం మొదలైంది. సీఎం కేసీఆర్ మళ్లీ కుల సంఘాలను పిలిచి కుల సంఘాలకు డబ్బులు పంచుతారు. కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేస్తారు. ఈ విషయంలో కొందరు కుల సంఘాలు వాళ్ల సామాజికవర్గాన్ని పట్టించుకోరు. వారి సమస్యలను ప్రస్తావించారు. కేసీఆర్ వలలో పడి మోసం చేస్తారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.


ఓబీసీ సామాజికవర్గ ప్రజలకు ఓబీసీ మోర్చా అండగా ఉండాలి. అన్ని కుల సంఘాలకు దిక్సూచి కావాలి. ప్రతి సామాజికవర్గాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలి. వారికి భరోసా ఇవ్వాలి. కేసీఆర్ పాలనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి..' అని బండి సంజయ్ సూచించారు.


Also Read: TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్  


Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి