Telangana Bonalu 2022: ఆషాడంలో వచ్చే బోనాలకు తెలంగాణాలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందులో లష్కర్ బోనాలకు భక్తులు రాష్ట్రనలు మూలల నుంచి భక్తులు వచ్చి అమ్మను దర్శించుకోవడం విశేషం. అటువంటి ఉజ్జయిని బోనాల పండుగకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేసారు. అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యే నుంచి చివరి దాక కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాట్లు చేసారు. అంతేకాకుండా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు మొదలుకుని అన్ని రకాల నిఘాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణంగా పరిశీలించే విధంగా కమాండ్ కంట్రోలింగ్ వ్యవస్థను హైదరాబాద్ పోలీసు సిద్ధం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆషాఢమాసం మొదలైనప్పటి నుంచే అమ్మవారి ఆలయం వద్ద భక్తుల తాకిడి మొదలైంది. అంతేకాకుండా భక్తులు మహంకాళి అమ్మవారికి బోనాలను కూడా సమర్పిస్తున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉన్న ప్రతి అమ్మావారి గుడి ముస్తాబవుతోంది. అయితే లష్కర్ బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడంతో వారం రోజుల ముందు నుంచే భద్రత పై రివ్యూ చేశారు అధికారులు. మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గత రెండు రోజుల నుంచే పోలీసులు  అమ్మవారి ఆలయం తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీఆధీనంలోకి తీసుకున్నారు.



వివిఐపీ(VIP) తాకిడికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. మహిళలు కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గుడి పరిసర ప్రాంతాల్లో వందకి పైగా సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహిళలను వేధించకుండా  షీటీమ్స్ బృందాలు కూడా రంగంలోకి దింపనున్నారు. భక్తుల సౌకర్యర్థం మంచి నీటి సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు  పారిశుధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.



ట్రాఫిక్ ఆంక్షలు:


 జాతర జరగనున్న రెండు రోజులు ఆలయ పరిసరాల చుట్టూ.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్‌ పోలీసులు.  రేపు ఉదయం (ఆదివారం) నాలుగు గంటల నుంచి మరుసటి రోజు పూజలు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌లో పలు రూట్లల్లో ట్రాఫిక్ దారి మళ్ళించారు. ఆర్టీసీ బస్‌లను, ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్, కర్బలా మైదాన్ మీదిగా  రాణిగంజ్ చౌరస్తా వైపు దారి మళ్లించనున్నారు. బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీ మండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లించనున్నారు. ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్ వైపు దారి మళ్లించనున్నారు.


భక్తులు ఈ చోట్ల మాత్రమే పార్కింగ్‌ చేయాలి:


బోనాల జాతరకు వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రతేకమైన పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. సుభాశ్ రోడ్డు ప్రాంతాల నుంచి వచ్చే వారు వాహనాలను ఓల్డ్ జిల్‌ఖానా ఓపెన్ ప్లేస్‌లో పార్క్ చేయాలని అధికారులు తెలిపారు. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వచ్చే భక్తులు వాహనాలు ఇస్లామియా హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్, మహబూబీయ కాలేజీలో పార్క్ చేయాలని అధికారులు సూచించారు.


Also Read:  Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!


Also Read:  Weight loss tips in 10 days: వీటితో తయారు చేసిన రొట్టెలను తింటే పది రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook