Balka Suman Mass Warning To CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సంస్కార హీనుడని, అతని గురించి మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణత్యాగం వరకు వెళ్లి తెలంగాణను సాధించి తెచ్చిన గొప్ప మహనీయుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికోచ్చినట్లు దుర్భాషాలాడటం సిగ్గుచేటని అన్నారు.  మా కేసీఆర్ ను మరోసారి ఏమైన అంటే లక్షమందితో వచ్చి పండబెట్టి తొక్కిపడేస్తామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: How To Make Egg Curry: బ్యాచిలర్ బ్రదర్స్ ఈ ఎగ్ కర్రీ మీకోసమే..కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే సింపుల్ రెసిపీ..


రేవంత్ రెడ్డి .. బూతులతో ఏకీపారేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేశంతో తన చెప్పును కూడా చూపిస్తూ.. కొడతామంటూ.. బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి..  తీవ్రంగా పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాలలో పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అంతకు ముందు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరిష్ రావు కూడా ఖండించారు.


సీఎం రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఏనాడు కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కానీ రెండు నెలల్లోనే సీఎం కేసీఆర్ ప్రాకెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టారన్నరారు.


Read More: Ram Pothineni: రెమ్యునరేషన్ తగ్గించుకొని యువహీరో.. ఏకంగా అన్ని కోట్లు అడిగారా?


కేవలం పాలనను డైవర్ట్ చేయడానికి రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపాలను కోవడం మూర్ఖత్వమని మాజీ మంత్రి హరిశ్‌ రావు ఎద్దెవా చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో.. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ చేసిన తప్పులను ఎండగడుతూ, అనేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook