How To Make Egg Curry: బ్యాచిలర్ బ్రదర్స్ ఈ ఎగ్ కర్రీ మీకోసమే..కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే సింపుల్ రెసిపీ..

How To Make Egg Curry In Telugu: కోడిగుడ్ల కూర అంటే అందరు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్న వారు ఈ కర్రీని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈరోజు మేము సింపుల్ పద్ధతిలో కొత్త ఎగ్ కర్రీ రెసిపీ ని పరిచయం చేయబోతున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 02:40 PM IST
How To Make Egg Curry: బ్యాచిలర్ బ్రదర్స్ ఈ ఎగ్ కర్రీ మీకోసమే..కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే సింపుల్ రెసిపీ..

 

How To Make Egg Curry In Telugu: భారతీయులు కోడిగుడ్లతో వివిధ రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలామంది కూరగాయలతో తయారుచేసి కూరల్లో కూడా కోడిగుడ్లను వినియోగిస్తారు. ఇలా కూరల్లో మిక్స్ చేసి వండుకోవడం వల్ల నోటికి రుచి కలగడమే కాకుండా శరీరానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కోడిగుడ్లను ఏ స్టైల్‌లో వండిన రుచిగానే ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే వారంలోని సగం రోజులు కోడిగుడ్లతో తయారుచేసిన కర్రీ లనే ఎక్కువగా తింటూ ఉంటారు. బ్యాచిలర్స్ కోసం ఈరోజు మేము ఓ సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీని పరిచయం చేయబోతున్నాం..ఈ రెసిపీతో మీ నోటికి రుచి కలగడమే కాకుండా శరీరాన్ని కూడా లాభాలు కలుగుతాయి.

ఈ సింపుల్ ఎగ్ కర్రీ కి కావాల్సిన పదార్థాలు:
✾ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్
✾ అర టీ స్పూన్ జీలకర్ర
✾ నాలుగు ఎండుమిర్చిలు
✾ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
✾ రెండు చిన్నగా తరుముకున్న టమాటాలు
✾ కూర రుచికి సరిపడా ఉప్పు
✾ ఐదు ఉడికించి తీసుకున్న కోడుగుడ‌్లు
✾ కర్రీకి సరిపడా కారం
✾ ఒక టీ స్పూన్ ధనియాల పొడి
✾ ఒక చిన్న కప్పు తరిగిన పుదీనా ఆకులు
✾ ఒక గ్లాస్ నీళ్లు
✾ ఒక టీ స్పూన్ గరం మసాలా
✾ కూర రుచికి సరిపడా తరిగిన కొత్తిమీర ఆకు

ముందుగా ఈ ఎగ్ కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ పై క‌ళాయి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు టీ స్పూన్ల మంచి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ఎండు మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి క‌ళాయిపై మూత పెట్టి, ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో టమాటా ముక్కలను వేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అందులో ఒక గ్లాసు నీటిని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పై ఉంచాలి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకుని మరుగుతున్న పులులో వీటిని వేసుకొని నాలుగు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోనే తరిగిన కొత్తిమీర పుదీనా ఆకు వేసి.. మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత పైనుంచి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా ఉప్పు వేసి.. మరో రెండు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News