Telangana Budget 2021 Highlights: తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి హ‌రీష్ రావు శాస‌న‌స‌భ‌లో ప్రవేశ‌పెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2,30,825.96 కోట్లతో గురువారం ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంత‌రం బ‌డ్జెట్‌లో ఆయా శాఖలకు జరిగిన కేటాయింపుల వివరాలు చదివి వినిపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడేళ్ల తెలంగాణ రాష్ట్రం ప్రగ‌తి విషయంలో అనేక రాష్ర్టాల‌ను అధిగ‌మించిందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, ప్రజ‌ల ఆకాంక్షల‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం నెర‌వేరుస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో ల‌క్ష్యాల‌ను నిర్ణీత స‌మ‌యంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. కరోనా కారణంగా గత ఏడాది తలెత్తిన స‌మ‌స్యలు, స‌వాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగ‌మించిందన్నారు.


Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం 



తెలంగాణ బడ్జెట్‌ 2021-22 ముఖ్యాంశాలు...
  - రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.96 కోట్లు
  - రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు
  - ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు
  - మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు
  - పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు
  - రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు
  - ఎస్సీల ప్రత్యేక ప్రగ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు కేటాయింపు
  - ఎస్టీల ప్రత్యేక ప్రగ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు కేటాయింపు
 - సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ రూ.1000 కోట్లు
 - బీసీ కార్పొరేష‌న్‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ.1000 కోట్లు
  - బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
  - మైనార్టీ గురుకులాల నిర్వహ‌ణ‌కు రూ.561 కోట్లు
  - మైనార్టీ సంక్షేమానికి రూ.1,606 కోట్లు


Also Read: Telangana MLC Elections 2021 Results: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో TRS అభ్యర్థులు
  - పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
  - వ్యవసాయంలో యాంత్రీకీకరణకు రూ.1500 కోట్లు
  - రైతుబంధుకు రూ.14,800 కోట్లు కేటాయింపు
  - రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు
  - వ్యవసాయశాఖకు రూ.25వేల కోట్లు కేటాయింపు
  - పశు సంవర్థకశాఖ కోసం రూ.1,730 కోట్లు
  - నీటిపారుదల శాఖకు రూ.16,931 కోట్లు
  - సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు
  - వైద్యారోగ్య శాఖ‌కు రూ.6,295 కోట్లు
  - విద్యారంగం నూత‌న ప‌థ‌కం కోసం రూ.4 వేల కోట్లు
  -  పాఠ‌శాల విద్యకు రూ.11,735 కోట్లు
  -  ఉన్నత విద్యా రంగానికి రూ.1,873 కోట్లు
  - నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ.610 కోట్లు


Also Read: Secunderabad railway station new look: విమానాశ్రయపు సొగసులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook