Massive fund to allocate for Pensions and Rythu Runa Mafi  in TS Budget: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి నేటి నుంచి సమావేశం కానున్నాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి రూ. 2.65 నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల అనంతరం రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో.. గతేడాది కంటే రూ.35,000 కోట్ల మేర బడ్జెట్‌ పెంచనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది చివరిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో.. దీన్ని ఎన్నికల బడ్జెట్‌గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం. అందుకే సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట వేశారట. ఈ క్రమంలోనే రైతు రుణ మాఫీ కోసం ప్ర‌త్యేకంగా భారీ మొత్తంలో నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రూ. 37 వేల లోపే అమ‌లు చేసింది. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ మాఫీ చేస్తామ‌ని గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గతంలోని హామీలను నెరవేర్చే అవకాశం ఉంది. 


2022-23 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త పింఛన్ దారులను చేర్చుకుంటున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక నిధిని ఈసారి ఏర్పాటు చేశారట. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కోసం బడ్జెట్‌ను పెంచనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్నైకి వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్లు, రైతు రుణ మాఫీకి భారీ నిధులు కేటాయించారని తెలుస్తోంది. 


Also Read: Telangana Budget 2022: నేడు తెలంగాణ బ‌డ్జెట్.. ఎమ్మెల్యే ఈటెల అసెంబ్లీ రాకపై పోలీసుల ఆంక్షలు!!


Also Read: IPL 2022 Schedule: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల, తొలి మ్యాచ్ ఎవరిదంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook