Minister Harish Rao introduced Telangana Budget 2022: తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శాస‌న‌స‌భ‌లో వార్షిక బడ్జెట్‌ను  ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో ఆయన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన కొద్ది కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన సీఎం కేసీఆర్‌ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైంది' అని హరీశ్‌ రావు తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా.. క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు అని ఆయన చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్‌ 2022-23 ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే:


₹ రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌


₹ రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు


₹ దళిత బంధుకు రూ.17,700 కోట్లు


₹ క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు


₹ కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు


₹ అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు


₹ పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు


₹ పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు


₹ పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ


₹ ఆసరా పెన్షన్లకు 11728 కోట్లు


₹ కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు 2750 కోట్లు


₹ డబుల్ బెడ్రూమ్ ల కోసం 12000 కోట్లు


₹ మన ఊరు- మన బడి 7289  కోట్లు.


₹ ఎస్టీల సంక్షేమం కోసం 12565 కోట్లు


₹ పట్టణ ప్రగతి కోసం 1394 కోట్లు


₹ బీసీ సంక్షేమం కోసం 5698కోట్లు


₹ బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు


₹ పల్లె ప్రగతి 3330 కోట్లు


₹ ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు


₹ హరితహారంకు 932 కోట్లు


₹ రోడ్లు, భవనాల కోసం 1542 కోట్లు


₹ మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు


₹ వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ


₹ రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ


₹ రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.93 కోట్లు


₹ 2022-23 నాటికి మొత్తం అప్పులు 3,29,998 కోట్లు. జీఎస్డీపీలో 25 శాతం.


₹ పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ


₹ సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం.


₹ రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం. పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం.


₹ అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు