Telangana By Elections: తెలంగాణలో బై పోల్ కి రెడీ అవుతున్న ప్రధాన పార్టీలు..
Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.
Telangana By Elections: తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా..! ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ తప్పదని అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరగుుతుంది. కోర్టు తీర్పుతో అక్కడ మాత్రం ఉప ఎన్నిక తప్పక పోవచ్చనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ సిద్దమైందా.. అంతేకాదు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుందా అంటే ఔననే మాట పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వస్తుందని పొలిటికల్ సర్కిల్ జోరుగా చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉండగా ఉప ఎన్నిక ఎందుకు వస్తుందనేది మీ అనుమానం కదా. అక్కడే ఉంది అసలు కథ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడంతో దానం నాగేందర్ ఆలోచన తీరులో మార్పు వచ్చింది. వెంటనే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో చేరిన దానం నాగేందర్ తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న దానం నాగేందర్ కు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రూపంలో పెద్ద సవాల్ వచ్చి పడింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం నాగేందర్ కు ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూగా మారింది.
గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరారు. కానీ వారికి రానీ సమస్య ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో వచ్చి పడింది. ఇప్పుడు ఇదే దానంకు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగితా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్ కు మాత్రం చిక్కులు తప్పకపోచ్చనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం నియమించిన పీఏసీ ఛైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అంటే మిగితా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడుతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా.. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకు గాను దానంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఆ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. హైకోర్టు కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటించమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా ఇప్పటికే దానం నాగేందర్ కు సంకేతాలు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఉప ఎన్నికకు సిద్దంగా ఉండాల్సిందిగా దానం నాగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందట. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదు అన్న భావనలో కాంగ్రెస్ ఉందట. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృత నిశ్చయంతో ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక వ్యూహాంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. వీలైనన్ని అభివృద్ది కార్యక్రమాలు ఇక నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చేపట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యినట్టు సమాచారం.
మొత్తానికి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఒక వేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఇక్కడి జనాలు ఏ పార్టీనీ ఆదరిస్తారు.. గెలుపు ఎవరిని వరిస్తుంది.ఉప ఎన్నిక కోసం పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.