తెలంగాణ ( Telangana ) మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి ముందే ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ యాక్ట్ సవరణ బిల్లుకు కేబినెట్ అమోదం తెలిపింది. దాంతో పాటు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులు అనే రూల్ తొలగించించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా?


మంత్రివర్గ సమావేశంలో రానున్న పదేళ్ల పాటు డివిజన్ల వారీగా రిజర్వేషన్లు కొనసాగించే నిర్ణయం కూడా తీసుకున్నారు. కార్పోరేటర్లకు అందించే నిధులను కూడా సవరణ బిల్లులో చేర్చనున్నట్టు సమాచారం. సవరణలతో కూడిన జీహెచ్ఎంసీ ( GHMC ) బిల్లును అక్టోబర్13న జరిగే శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు పలు అంశాలపై మంత్రిమండలి చర్చించినట్టు సమాచారం


అందులో కీలకమైన అంశాలు ఇవే..


* గ్రామాల నుంచే ధాన్యం కొనుగోలుకు నిర్ణయం.
* దీని కోసం 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.
* నాలా చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించారు. భూమార్పిడిని సులభతరం చేస్తూ, అధికార దుర్వినియోగం తగ్గించేందుకు ఏర్పాట్లు చేయడానికి నిర్ణయం.
* స్వల్ప సవరణలో రిజిస్ట్రేషన్ చట్టానికి ఆమోదం.


ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి
* జీహెచ్ఎంసీ పాలక మండలిలో మహిళలు 50 శాతం ప్రాతినిధ్యం వహించేలా చట్టంలో సవరణకు కేబినెట్ అంగీకరించింది.
* ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు గడువు అక్టోబర్ 20 వరకు పెంపు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR