Telangana Cabinet Meeting CM KCR to tour in Warangal tomorrow : తెలంగాణ (Telangana) సీఎం కేసీర్ మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం (CM KCR) పరిశీలించనున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో (Pragati Bhavan‌) తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణలోని కరోనా పరిస్థితులతో పాటు పలు అంశాలపై కేబినెట్‌ చర్చించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్యశాఖ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది. అలాగే ఎలాంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యవసాయంపై (Agriculture) కూడా కేబినెట్ చర్చించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ (Cabinet) పర్యటనపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 


కేసీఆర్‌ పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లోని పంట నష్టం జరిగిన గ్రామాల్లో రేపు పర్యటిస్తారు. కేసీఆర్‌‌తో (KCR‌) పాటు వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. 


Also Read : Cabinet Meeting : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన


ఇక కేబినెట్‌ వర్షాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై కూడా చర్చించింది. ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరిందని అధికారులు కేబినెట్‌కు వివరించారు. అయితే వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం పూర్తిగా కొనే వరకు కొనుగోలు కేంద్రాల కొనసాగింపునకు కేబినెట్‌ (Cabinet) ఆదేశించింది.


Also Read : Husband Wife Funny Videos: నిద్రపోతున్న భర్తతో భార్య ఏం చేసిందో చూడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


by Taboola


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook