Cabinet Meeting : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన

Telangana Cabinet Meeting : తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ఉండనుంది. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కొనసాగిన కేబినెట్‌ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 07:39 PM IST
  • తెలంగాణలో ఇంగ్లిష్‌ మీడియం బోధనకు కొత్త చట్టం
  • తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం..
  • సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం
Cabinet Meeting : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన

Telangana Cabinet Meeting Cabinet decides to bring a new law for English medium teaching : తెలంగాణలో (Telangana) ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనకు (English medium teaching) కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ (CM KCR‌) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రిమండలి (Cabinet) సమావేశమైంది. ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన పలు విషయాలపై కేబినెట్‌ చర్చించింది. మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా ఫీజుల నియంత్రణ, ఇంగ్లిష్‌ మీడియంలో (English Medium) బోధనపై అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు కేబినెట్‌ ఒక సబ్‌ కమిటీని (Sub Committee) ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అధ్యక్షతన ఈ సబ్‌ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌ ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Also Read : Pranayakalahotsavam: తిరుమలలో ప్రణయకలహోత్సవం.. చాలామంది భక్తులకు తెలియని ఆసక్తికరమైన ఘట్టం

రానున్న శాసనసభా సమావేశాల్లో ఇందుకు సంబంధించిన కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ (Cabinet) నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు రూ.7289 కోట్లతో "మన ఊరు-మన బడి" (mana ooru mana badi) ప్రణాళిక కోసం కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది.

Also Read : AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,108 కరోనా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News