Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఇక తొలగిపోనుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో పాటు అన్నిరకాల నిబంధనల్ని పూర్థి స్థాయిలో తొలగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కరోనా వైరస్(Corona Virus)తగ్గుముఖం పట్టింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తగ్గుతుండటంతో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గింది. కరోనా పూర్తి నియంత్రణలో వచ్చిందని కేబినెట్ భావించింది. అందుకే జూన్ 20 నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ (Lockdown)ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ సందర్బంగా విధించిన అన్నిరకాల నిబంధనల్ని పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. 


రాష్ట్రంలో రేపట్నించి సినిమా హాల్స్, పబ్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార , వాణిజ్య సముదాయాలు తెర్చుకోనున్నాయి. మెట్రో, బస్సు సర్వీసులు యధావిధిగా నడవనున్నాయి. మరోవైపు జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. మే 12 నుంచి జూన్ 19 వరకూ 38 రోజుల పాటు తెలంగాణ(Telangana)లో కొనసాగిన లాక్‌డౌన్‌కు రేపట్నించి తెరపడనుంది. రాష్ట్రంలో అన్ని కేటగరీల విద్యాసంస్థల్ని పూర్తి స్థాయి సన్నద్ధతతో తెరవనున్నారు. ప్రజా జీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ వెల్లడించింది. మాస్క్ ధారణ, బౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం మాత్రం తప్పనిసరి అని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకై ప్రజల సంపూర్ణ సహకారం అవసరమని కోరింది.


Also read: Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook