Revanth Reddy Vs KCR: తెలంగాణలో రేవంత రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే..కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణలో తనదైన ముద్ర వేసారు. రైతు బంధు, రైతులకు ఇన్సూరెన్స్, కాళేశ్వరం, కేంద్రం సాయంతో  హైదరాబాద్ లో ఫ్లై ఓవర్స్ తో ట్రాఫిక్ కు పెట్టగలిగారు. మెట్రో రైలు ఏర్పాటు,  శాంతి భద్రతలపై షీ టీమ్స్,  అంతేకాదు సెక్రటేరియట్ ను కూలగొట్టి.. కొత్త సచివాలయం నిర్మించారు. అంతేకాదు సెక్రటేరియట్ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇలా తెలంగాణలో తనదైన ముద్ర వేసారు కేసీఆర్. అది ఎవరు కాదనలేని నిజం. మరోవైపు తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్రను కాదనలేము.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు.  తన పుట్టిన రోజు సందర్భంగా  మూసీ ప్రక్షాళన ఎవరు అడ్డుకున్నా ఆగబోదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  మూసీ ప్రక్షాళనకు కొంత మంది దుర్మార్గులు అడ్డొస్తున్నారన్నారు. అలా అడ్డుపడే వారిలో బీఆర్ఎస్ ముందుందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన, బోల్డోజర్‌లకు ఎవరు అడ్డు వచ్చినా తొక్కేస్తామని హెచ్చరించారు.


కేసీఆర్...  మూసీకి అడ్డుపడితే కుక్కచావు చస్తావన్నారు. ఇది   ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిశ్చయించుకున్నామనీ.. మరో 30 రోజుల్లో తుది రూపం తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జనవరి ఫస్ట వీక్ లోనే  వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని సీఎం తెలిపారు.  మరోవైపు సంగెం నుంచి నాగిరెడ్డిపల్లె వరకు ధర్మారెడ్డి కాల్వ వెంబడి రెండున్నర కిలో మీటర్ల మేర రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. మూసీ పరీవాహక ప్రాంత రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.ఇక రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హైడ్రాతో పాటు మెట్రో రెండో దశ పనులతో పాటు, ఫోర్త్ సిటీతో పాటు  తెలంగాణలో తన మార్క్ ఉండేలా పాలన కొనసాగిస్తున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.