VRO Posts: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రవాణా రంగంలో టీఎస్ ప్లేస్ లో టీజీని తీసుకొచ్చారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంలో పలు మార్పులు చేసారు. అంతేకాదు రాజధానితో పాటు తెలంగాణ పల్లెల్లో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్‌ రెవెన్యూ అధికారి పేరిట పోస్టులను భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 వేల 911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు. వీఆర్‌ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్వో, వీఆర్‌ఏలను నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో 3,600 మంది మాజీ వీఆర్వోలు, 2,000 మంది వరకు మాజీ వీఆర్‌ఏలకు అర్హత ఉన్నట్టు తేలింది.


మిగతా సుమారు 5వేల 300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలున్నాయట.  అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పూర్తి చేసిన మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలను సర్వేయర్లుగా నియమించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.  ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్‌ రెవెన్యూ అధికారి, సర్వేయర్‌ పోస్టుల్లో మిగిలిన వాటిని రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ పోస్టుల్లో చేరేందుకు మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలు సుముఖత వ్యక్తం చేస్తేనే వారినే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.